ETV Bharat / state

విశాఖలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన - విశాఖ నేటి వార్తలు

విశాఖ జీవీఎంసీ గాంధీ కూడలి వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేశారు. కొవిడ్ సమయంలో తమతో పనులు చేయించుకుని, జీతాలు ఇవ్వడం లేదంటూ వారు ఆందోళన చేశారు. వీరి నిరసనకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది.

nursing staff protest to demand for salaries in vizag
విశాఖలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన
author img

By

Published : Dec 1, 2020, 5:33 PM IST

కొవిడ్​పై పోరాటంలో ముందువరుసలో ఉన్న తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ... విశాఖపట్నంలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేశారు. కరోనా ఆస్పత్రుల్లో పని చేయించుకుని, జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఈ ఆందోళనకు... మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో భాజపా బృందం మద్దతు ప్రకటించింది. కొవిడ్ తీవ్రత తక్కువగా ఉందని నర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా తొలగించడమేమిటని విష్ణు కుమార్ ప్రశ్నించారు. కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వానికి... కేంద్రం ఎన్నో రకాలుగా సహకారం ఇచ్చిందని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.