ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విశాఖ కలెక్టరేట్ ఎదుట నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేశారు. కరోనా సమయంలో సేవలందించేందుకు గానూ ఆంధ్ర వైద్య కళాశాల..... 500 మంది బీఎస్సీ పూర్తిచేసిన వారిని నియమించింది. ఆరు నెలల పాటు సేవలందించేలా... ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు ఇచ్చారు.
ఐతే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఉన్న ఫళంగా తొలగిస్తున్నట్టు ఆంధ్ర వైద్య కళాశాల హఠాత్తుగా ప్రకటించింది. పని చేసిన 4 నెలల కాలానికి జీతాలు సైతం ఇవ్వలేదని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బకాయి జీతాలు చెల్లించాలని.... ఆరు నెలల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: