విశాఖ జిల్లాలోని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. అలాగే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో, నర్సీపట్నం అటవీశాఖ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేశారు.
మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో విలీనం చేయక పోవటం వల్ల అనేక గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. ఎన్నో రాయితీలు, ప్రభుత్వ పథకాలకు దూరమై పోతున్నారని సీఐటీయూ జిల్లా నాయకులు పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి