విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని 15 పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. చిప్పాడలోని నామినేషన్ కేంద్రాన్ని మండల ఎన్నికల ప్రత్యేక అధికారిణి జి చంద్రకళతో పాటు ఎమ్డీవో వెంకటరమణ, తహసీల్దార్ కె.వి. ఈశ్వరరావు పరిశీలించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.
15 సర్పంచ్, 166 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 32,219 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దాకమర్రి, తాటితూరు, తాళ్లవలస, చిప్పాడ పంచాయతీలను నామినేషన్ కేంద్రాలుగా అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ'పై.. హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్