విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో బ్యాంకులన్నీ ఖాతాదారులతో రద్దీగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ చేయూత నగదు తీసుకునేందుకు మహిళలు భారీగా బారులు తీరారు.
చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండల్లాల్లో 17,743 మంది మహిళలకు 32 కోట్ల నగదు ఆయా ఖాతాల్లో జమ అయ్యింది. దీంతో నగదును తీసుకునేందుకు ఏటీఎం మిషన్ల వద్ద, బ్యాంకుల వద్ద సామాజిక దూరం పాటించకుండా.. మాస్కులు ధరించకుండా క్యూల్లో నిలబడ్డారు.
ఇదీ చదవండి: కన్నతండ్రి కర్కశత్వం... సీసీ ఫుటేజ్‌లో నిక్షిప్తం..!