విశాఖ జిల్లా మల్కాపురానికి చెందిన మాధురికి.. అనకాపల్లికి చెందిన మున్నాకి పెద్దలు వివాహం నిశ్చయించారు. వైభవంగా పెళ్లి చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నారు. కరోనా ప్రభావంతో బంధువులెవరూ లేకుండానే వివాహ తంతు పూర్తి చేశారు. నేడు వారి వివాహం వధూవరుల తల్లిదండ్రుల సమక్షంలోనే నిరాడంబరంగా పూర్తయింది. మాస్కులు ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ వేడుకను నిర్వహించారు.
ఇవీ చదవండి: