ETV Bharat / state

వంగ రైతులపై లాక్​డౌన్​ ప్రభావం.. మిగిలింది భారీ నష్టం - east godavari vanga raithula taja news

లాక్​డౌన్.. రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్​కు తీసుకొచ్చిన వంకాయలకు సరైన ధర లేక... కనీసం కొనేవారు ముందుకు రాక వంగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక దిగుబడి వచ్చిన పంట... అప్పుల నుంచి గట్టేక్కిస్తుందనే సమయానికి కరోనా మహమ్మారి వచ్చి ఆశలు నెలకొరిగేలా చేసిందని వాపోతున్నారు.

వంగ రైతులపై లాక్​డౌన్​ ప్రభావం
వంగ రైతులపై లాక్​డౌన్​ ప్రభావం
author img

By

Published : Apr 19, 2020, 4:45 PM IST

వంగ రైతులపై లాక్​డౌన్​ ప్రభావం

తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన రాజానగరం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కూరగాయల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. దొండ, బెండ, వంగ, కాకర, టమాట, దోస తదితర కూరగాయలతో పాటు ఆకు కూరలను రైతులు పండిస్తున్నారు. ఈ కాయగూరల్ని స్థానిక మార్కెట్లతో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, మడికి మార్కట్లకు తరలిస్తుంటారు. అయితే కరోనా దెబ్బతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా వంగ తోట సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు కౌలు సహా రూ.70 వేల వరకు పెట్టుబడులు పెట్టామని... తీరా పంట చేతికొచ్చే సమయంలో కరోనా రూపంలో కష్టం ముంచుకొచ్చిందని రైతులు వాపోతున్నారు. లాక్‌డౌన్ వల్ల రవాణా స్తంభించిపోవటంతో వంకాయలు తోటల్లోనే మగ్గి పోతున్నాయని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

అప్పు చేసి పెట్టుబడి పెట్టాం

జిల్లాలోని మెట్ట ప్రాతంలో సుమారు 14 వందల ఎకరాల్లో వంగతోటలు సాగవుతున్నాయి. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. కరోనా కారణంగా కూరగాయలు కోసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. వచ్చిన కొంతమందితో సాయంత్రం పూట కాయలు కోసి... అతి కష్టం మీద సమీపంలోని మార్కెట్లకు తరలిస్తున్నారు. ఐనప్పటికీ సగం కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు విలపిస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాలు ఆదేశించినా.... క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ విక్రయాలకు మార్గం సుగుమం చేయాలని వేడుకొంటున్నారు.

ఇదీ చూడండి:

కరోనా ఎఫెక్ట్​: పడిపోయిన వంగ ధరలు..రోడ్డుపై పారబోసిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.