విశాఖ పాడేరు ఏజెన్సీలో చాలా గ్రామాల్లో సిగ్నల్స్ సేవలు అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంలో తడుస్తూ గొడుగుల చేతపట్టుకొని ప్రభుత్వ పథకాల ఆన్లైన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి, డుంబ్రిగుడ మండలం సొవ్వా, జి.మాడుగుల మండలం పులుసుమామిడి కొండలలో ఎక్కడ చూసినా గొడుగులు వేసుకుని వర్షంలో ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా ఆన్లైన్ కోసం కొండల్లో గిరిజనులు వర్ష పోతున్నారు. సచివాలయ పరిధిలో సెల్ టవర్లు నిర్మించి అక్కడే ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'రామ్ కీ ఫార్మా సిటీ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలకు ప్రణాళిక చేస్తున్నాం'