ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న కట్ ఆఫ్ ఏరియాలోని జోడాంబోలలో శనివారం ఒడిశా డీజీపీ అభయ్ నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. మావోయిస్టులకు కంచుకోటలా ఉన్న కట్‌ఆఫ్‌ఏరియాలో ఒడిశా పోలీస్ ఉన్నతాధికారి పర్యటించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. మొదట ఆ ప్రాంత గిరిజనులతో సమావేశమైన అయన ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అందరికి మాస్క్‌లను పంపిణీ చేశారు. కట్ ఆఫ్ ఏరియాలో రెండో పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో మావోయిస్టుల దూకుడుకు కళ్లెం వేసినట్లయింది. గతంలో బోడోపడా వద్ద నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయగా, తాజాగా జోడాంబోలో మరో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. డీజీపీతోపాటు మల్కాన్‌గిరి జిల్లా ఎస్ఫీ రిషికేశ్ డికిళారి, ఎస్‌వోజీ కమాండెంట్ అనిరుధ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టుల కంచుకోటలో మరో పోలీస్ స్టేషన్
మావోయిస్టులకు కంచుకోటలా ఉన్న కట్ఆఫ్ ఏరియాలో నూతన పోలీస్ స్టేషన్ ను ఒడిశా డీజీపీ అభయ్ ప్రారంభించారు.
ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న కట్ ఆఫ్ ఏరియాలోని జోడాంబోలలో శనివారం ఒడిశా డీజీపీ అభయ్ నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. మావోయిస్టులకు కంచుకోటలా ఉన్న కట్‌ఆఫ్‌ఏరియాలో ఒడిశా పోలీస్ ఉన్నతాధికారి పర్యటించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. మొదట ఆ ప్రాంత గిరిజనులతో సమావేశమైన అయన ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అందరికి మాస్క్‌లను పంపిణీ చేశారు. కట్ ఆఫ్ ఏరియాలో రెండో పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో మావోయిస్టుల దూకుడుకు కళ్లెం వేసినట్లయింది. గతంలో బోడోపడా వద్ద నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయగా, తాజాగా జోడాంబోలో మరో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. డీజీపీతోపాటు మల్కాన్‌గిరి జిల్లా ఎస్ఫీ రిషికేశ్ డికిళారి, ఎస్‌వోజీ కమాండెంట్ అనిరుధ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైకాపాతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి అవంతి