ETV Bharat / state

ఏవోబీలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న అగ్రనేతలు - ఏవోబీలో ఎన్​కౌంటర్

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మరోసారి తుపాకి గర్జించింది. ఆదివారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా, అగ్రనేతలు ఆర్కే, ఉదయ్‌, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు

naxal-killed-in-an-encounter-at-aob
naxal-killed-in-an-encounter-at-aob
author img

By

Published : Jul 26, 2020, 9:09 AM IST

Updated : Jul 27, 2020, 6:43 AM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వారం తిరగకుండానే మరోసారి తూటాలు పేలాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించాడు. మృతి చెందిన మావోయిస్టు పాంగి దయగా గుర్తించారు. అగ్రనేతలు ఆర్కే, ఉదయ్‌, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 14న ఏవోబీలోని కటాఫ్‌ ఏరియా ప్రాంతంలో దొరాగుడా వద్ద, 19న విశాఖ జిల్లా పెదబయలు మండలం లండులు వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ఈ రెండు ఘటనల్లోనూ పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారు. వారిని పట్టుకోవడానికి ఆంధ్రా-ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలిస్తున్నారు.

ఒడిశా రాష్ట్రం చిత్రకొండ పోలీసుస్టేషన్‌ పరిధిలోని రాళ్లగెడ్డ సమీపాన గజ్జెడి అటవీ ప్రాంతంలో గాలింపు నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్‌ బలగాలకు శనివారం పొద్దుపోయాక మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య సుమారు రెండు గంటలుపాటు ఎదురుకాల్పులు జరిగాయి. అగ్రనాయకులతో పాటు పెద్దసంఖ్యలో దళాలు ఉన్నందున ఇంతసేపు కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. చీకటి పడినప్పటికీ ఆవలి పక్షం కాల్పులు జరుపుతూ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. రాత్రివేళ కాల్పులు నిలిచిపోయినప్పటికీ గ్రేహౌండ్స్‌ పోలీసులు అక్కడే మాటువేసి ఉండిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పరిశీలించడానికి వెళ్లిన సమయంలోనూ కొంతసేపు మళ్లీ కాల్పులు జరిగాయని సమాచారం. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరలను గాలింపు బలగాలు నిర్వీర్యం చేసుకుంటూ వెళ్లగా సంఘటన స్థలంలో మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. మృతుడు విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లివాసి పాంగి దయగా గుర్తించారు. ఆరేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలి నుంచి ఒక 303 తుపాకీ, 9 ఎంఎం పిస్టల్‌, మూడు కిట్‌ బ్యాగులు, మూడు సెల్‌ఫోన్లు, ఒక మ్యాన్‌ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అగ్రనాయకుల కోసం గాలింపు

మావోయిస్టులు పోలీసుల రాకపట్ల అప్రమత్తంగా ఉండటంతో ఎదురుకాల్పులు నుంచి అగ్రనాయకులు తప్పించుకున్నారని, లేదంటే వారికి భారీ ప్రాణనష్టం జరిగేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. చీకటి కూడా వారికి సహకరించిందని చెప్పారు. కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే), గాజర్ల రవి అలియాస్‌ దయ, ఎంకేవీబీ డివిజన్‌ కార్యదర్శి అరుణతో పాటు సీనియర్‌ నాయకుడు జగన్‌, అశోక్‌ తదితరులు ఏవోబీలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసు బలగాలు గాలిస్తున్నాయి.

ఇదీ చదవండి

మంచు శిఖరంపై మరపురాని విజయానికి 21 వసంతాలు

Last Updated : Jul 27, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.