విశాఖ మన్యం ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాన్ని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంత ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బంధువులు అప్పగించేందుకు ఏర్పాటు చేశారు.
ఒడిశా రాష్ట్రం చిత్రకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని రాళ్లగెడ్డ సమీపాన గజ్జెడి అటవీ ప్రాంతంలో గాలింపు నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు శనివారం పొద్దుపోయాక మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య సుమారు రెండు గంటలుపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లివాసి పాంగి దయగా గుర్తించారు.
ఇదీ చదవండి: ఏవోబీలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న అగ్రనేతలు