విశాఖజిల్లా అల్లిపురంలోని రాచపోలమాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్న అమ్మవారిని అక్కడి జనం నిత్యం పూజిస్తారు. దసరా సమయంలో నేరుగా మహిళలే దేవతకు కుంకుమ పూజలు చేయటం ఇక్కడి ప్రత్యేకత. స్థానికంగా ఉండే వ్యాపారులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు.
ఎలాంటి విగ్రహం లేకుండా కేవలం కవచ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి రెండేళ్లకొకసారి దేవతకు ప్రత్యేక పండుగ నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో అల్లిపురమంతా అమ్మవారి ఊరేగింపు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రాచపోలమాంబను కోరిన కోరికలు తీర్చుతుందని విశాఖ వాసుల నమ్మకం.
ఇదీ చదవండి: పుష్పకవిమాన వాహనంలో శ్రీవారు