విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరంలో ప్రకృతి వ్యవసాయ సామాజిక వనరుల కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. అన్ని వర్గాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని స్థానిక మహిళా రైతుల చేత నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎరువుల వాడకం, పురుగుల మందుల వాడకం తదితర రసాయన వినియోగంతో భూమిలో సారవంతం కోల్పోయే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.
గ్రామాల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వనరులు, పశువుల మలమూత్రాలు, బెల్లపు పిండి, చెరువు మట్టి తదితర వనరులతో వ్యవసాయాన్ని పూర్తిగా కేంద్రీకరణ చేసి రైతులకు అవగాహన కల్పించే విధంగా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది నుంచి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న రైతులు… ఈ ఏడాది మరింత ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.