ETV Bharat / state

రెండు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - narsipatnam crime news

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం మెట్టపాలెం శివారు మొండికండి సమీపంలోని సాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. రెండు వేల లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను ముందుగానే గమనించిన తయారీదారులు చాకచక్యంగా తప్పించుకున్నట్లు నర్సీపట్నం గ్రామీణ పోలీసులు తెలిపారు.

sara caught at nrsipatnam
sara caught at nrsipatnam
author img

By

Published : May 31, 2021, 8:25 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం మెట్టపాలెం శివారు మొండికండి సమీపంలోని ఓ జీడితోటలో నిల్వ చేసిన రెండువేల లీటర్ల బెల్లం ఊటను నర్సీపట్నం గ్రామీణ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు జీడితోటలను గాలించారు.

ఒక తోటలో ఎవరికీ అనుమానం రాకుండా తాటాకులు వేసి వాటి కింద భూమిలో ప్లాస్టిక్‌ కవర్లలో బెల్లం పులుపు నింపి దాచారు. భూ యజమాని జీడితోటను వేరే వాళ్లకు కౌలుకు ఇచ్చారు. కౌలు పొందిన వారికి తెలిసే జరుగుతోందా, లేదా అన్నది విచారణలో తేలనుందని ఎస్సై రమేష్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.