Madhurawada ANM: వ్యాక్సినేషన్‌లో ఉత్తమ సేవలకుగాను.. విశాఖ జిల్లాలోని మధురవాడ పీహెచ్‌సీ ఏఎన్‌ఎం చిల్లా ఉమామహేశ్వరికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. పీహెచ్‌సీ పరిధిలో 2.3 లక్షల మందికి ఈమె టీకాలు వేశారు. కొవిన్ యాప్‌లో నమోదైన ఈ వివరాల ఆధారంగా కేంద్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను దిల్లీలో సత్కరించడానికి ఆహ్వానం పంపించింది. ఈనెల 7న దిల్లీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లను కేంద్రంలోని సంబంధిత శాఖ అధికారులే చూస్తున్నారు.
పీహెచ్‌సీతోపాటు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేసుకోలేని వారందరినీ గుర్తించి వ్యాక్సినేషన్ చేయడం, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ధైర్యం చెప్పి టీకాలు వేసి కరోనాపై అవగాహన కల్పించడం వల్ల తమ పీహెచ్‌సీ ఏఎన్‌ఎంకు గుర్తింపు లభించిందని వైద్యురాలు దీపిక చెబుతున్నారు. ఈమెతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన మోహనమ్మ అనే ఏఎన్‌ఎంకు కూడా దిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆమె కూడా 2లక్షల మందికి టీకాలు వేయడంతో ఈ గుర్తింపు పొందారు.
ఇదీ చదవండి: