ఇమేజిన్ టూ ఇన్నోవేట్ పేరిట విశాఖలోని దాకమర్రి రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు జాతీయ స్థాయి ఈ - బైక్ గోకార్ట్ ఛాంపియన్ షిప్ జరగనుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు.. తాము సొంతంగా రూపొందించిన ఈ -బైక్లు, గో- కార్టింగ్ వాహనాలను ప్రదర్శించారు. ఏషియన్ ఈ బైక్ ఛాంపియన్ షిప్, ఇండియన్ ప్రో కార్ట్ ఛాలెంజ్ విభాగాల్లో 60 జట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా... ఈ- బైక్ విభాగంలో 30, గో కార్ట్ లో 11 బృందాలు తాము తీర్చిదిద్దిన వాహనాలతో కొలువుదీరాయి.
కార్యక్రమానికి విశాఖ నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జీఎస్టీ అదనపు కమిషనర్ నరసింహారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పోటీలు ప్రారంభించారు. యువ ఇంజనీర్లు తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అన్నారు. హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనం నడపడానికి వీలులేని ప్రత్యేక సెన్సార్లతో కొన్ని వాహనాలను ఇక్కడ రూపొందించారని.. యువ మేధస్సు మేకిన్ ఇండియాకు మార్గదర్శకం కావాలని జీఎస్టీ అదనపు కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు.ఇటువంటి ఆవిష్కరణల నుంచి మరింత మంది విద్యార్థులు స్ఫూర్తిని పొందేలా ప్రతి కళాశాల విద్యార్థులకు ఈ పోటీలను తిలకించేందుకు అవకాశం కల్పిస్తున్నామని రఘు విద్యాసంస్థల చైర్మన్ ఆచార్య కలిదిండి రఘు తెలిపారు.
తొలిరోజు విద్యార్థులు వాహనాలు తయారు చేయగా, రెండో రోజు గురువారం నిపుణులు వీటి ప్రమాణాలను పరిశీలిస్తారు. శుక్రవారం పరీక్షలు చేసి.. శనివారం పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల నగదు, ట్రోఫీలను బహుమతులుగా అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి