కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి సంబంధించి పరిధిలోని పెద్ద బొడ్డేపల్లిలో వంద పడకలతో పురుషుల కోసం కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. నర్సీపట్నం కొవిడ్ నోడల్ అధికారి జయతో కలసి ఆమె ప్రాంతీయ ఆస్పత్రిలోని రోగుల సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ కేంద్రం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ పడకలు పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడదామని సబ్ కలెక్టర్ వివరించారు.
నర్సీపట్నం డివిజన్ లోని ఎస్ రాయవరం మండలం దార్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాల , నర్సీపట్నంలోని గురుకుల పాఠశాలలో వంద పడకలతో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు ఆమె వివరించారు. తొలిదశ ఈ కేంద్రాల్లో పురుషులకు సేవలు అందిస్తారని ఇక్కడి రోగుల ఆక్సిజన్ స్థాయిని బట్టి వైద్యులు పరీక్షించి అత్యవసర కేసుల్లో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారని ఆమె పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న నిర్ధారణ పరికరాలు మేరకు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండీ.. 21 అనాథ మృతదేహాలకు ఎమ్మెల్యే దహన సంస్కారాలు