విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం తొలి సమావేశం... ఛైర్ పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. తెలుగు దేశం సభ్యుల వాకౌట్‌తో సమావేశం అర్థాంతరంగా ముగిసింది. ఈ సమావేశంలో తెదేపా సభ్యులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి అత్యంత అవసరమైన తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి స్పందిస్తూ.. తాము రెండు రోజుల శిక్షణ ముగించుకుని వచ్చిన తర్వాత ఈ విషయాలను పరిశీలిస్తామని తెలిపారు. ఛైర్ పర్సన్ తీరుపై తెలుగు దేశం సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ కారణంగా.. సమావేశం అక్కడితో ముగిసింది.
ఇదీ చదవండి:
కొవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోడానికి త్వరలో విలేజ్ క్లినిక్‌లు: సీఎం