లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు సొంత ఊరికి చేరుకున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కొండంత అండగా నిలిచింది. సాధారణ రోజుల్లో వచ్చే ఉపాధి కూలీల కన్నా... ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో మట్టి పనికి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రోజు 5 లక్షల 30 వేల మంది కూలీలు ఉపాధి హామీ పథకం మట్టి పనికి వస్తున్నారు. ఇదే సాధారణ రోజుల్లో 3 లక్షల 50 వేల మంది వచ్చేవారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెరువు, పంట కాలువలు పూడికతీత, కందకాలు, పొలాల్లో నీటికుంటలు వంటి పనులు కల్పిస్తున్నారు. కొలతలు ప్రకారం పనిచేసిన కూలీలకు వేసవి భృతితో కలిసి ఒక్కొక్కరికి రూ.237 వరకు కూలి చెల్లిస్తున్నట్లు చీడికాడ ఏపీఓ మురళి, ఈసీ కొండాజీ చెప్పారు.
ఇదీ చదవండి: అడవి పందుల కోసం పెడితే ఏనుగు చనిపోయిందట!