ETV Bharat / state

మాజీ మంత్రి గంటా అనుచరుడు నలంద కిశోర్‌ మృతి - గంటా అనుచరుడు నలంద కిశోర్‌ మృతి

nalanda-kishore-a-follower-of-former-minister-ganta-srinivas-has-died

author img

By

Published : Jul 25, 2020, 10:14 AM IST

Updated : Jul 25, 2020, 11:55 AM IST

10:12 July 25

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌(65) మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణలతో నెల క్రితం సీఐడీ పోలీసులు నలంద కిశోర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఓ మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అర్ధరాత్రి ఆయనను అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డుమార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

అక్కడి నుంచి వచ్చిన తరువాత నలంద కిషోర్ ఆరోగ్యం సరిగా లేనట్లు తెలుస్తోంది. గత 5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇవాళ ఆకస్మికంగా గుండె పోటుతో నలంద కిశోర్ మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు నలంద కిషోర్​ది కొవిడ్ మరణంగాను ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలతో తీవ్ర ఒత్తిడిలో నలంద కిషోర్ ఉండేవారని తెలుస్తోంది.

ఇదీ చదవండి

 నాపై కోపంతో... నా సన్నిహితులను ఇబ్బందిపెడతారా..?: గంటా

Last Updated : Jul 25, 2020, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.