Mushrooms in Uday Express: అది విజయవాడ-విశాఖ మధ్య నడిచే ప్రతిష్టాత్మకమైన ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. పూర్తి ఏసీ కంపార్ట్ మెంట్లతో నడిచే రైలు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతో కంపార్ట్మెంట్లో ఏకంగా పుట్టగొడుగులు పెరిగాయి. సి-6 కోచ్‌లోని వాష్ బేసిన్ దగ్గర ఈ పుట్టగొడుగులు దర్శనమిచ్చాయి. తాజాగా తీసిన ఈ చిత్రాలు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక రైల్లో ఎక్కిన ప్రయాణికులంతా ఈ పుట్టగొడుగులు చూసి ఆశ్చర్యపోతున్నారు. రైల్వే సిబ్బంది రైళ్లలో పుట్టగొడుగులు ఏమైనా పెంచుతున్నారా అనే సందేహం వెలిబుచ్చుతున్నారు. లోపలే ఇలా ఉంటే.. కోచ్ బయట పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అధికారులు స్పందించి కోచ్ నిర్వహణ, పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: