ETV Bharat / state

చోడవరంలో.. నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య - యువకుడి

విశాఖ జిల్లా చోడవరంలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ యువకుడిని దుండగుడు కిరాతకంగా హత్య చేశాడు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చోడవరంలో ఓ యువకుడి దారుణ హత్య
author img

By

Published : Jul 14, 2019, 6:43 PM IST

Updated : Jul 14, 2019, 8:05 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని దుండగుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పట్టణంలోని బీఎన్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన యువకుడిని చోడవరం ఎడ్లవీధికి చెందిన కోన రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు.

చోడవరంలో ఓ యువకుడి దారుణ హత్య

హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజేశ్‌ని దారుణంగా హతమార్చిన విషయం సీసీ ఫూటేజ్​లో స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత కత్తితో నరకిన అనంతరం.. రాజేశ్‌ కిందపడిపోయాడు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లిన దుండగుడు మళ్లీ వెనక్కి వచ్చి రక్తపుమడుగులో ఉన్న రాజేశ్‌పై మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. చనిపోయాడో లేదో అన్న అనుమానంతో మరోసారి కత్తితో వేటు వేసి అక్కడినుంచి పరారయ్యాడు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి బలవన్మరణం

Intro:ap_rjy_36_14_ysr penction_av_ap10019తూర్పుగోదావరిజిల్లా. ముమ్మిడివరం సెంటర్

Body:కొనసాగుతున్న ఫించన్లు పంపిణీ

Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గపరిధిలోని నాలుగు మండలాల్లో ఫించన్లు పంపిణీ కార్యక్రమంఇంకా కొనసాగుతూనేఉంది. ఈనెలఎనిమిదోతేదీన దివంగతరాజశేఖరరెడ్డి పుట్టినరోజు ప్రారంభంకాగా లబ్ధిదారులకు కొత్తప్రభుత్వం విడుదలచేసిన పుస్తకం చేరకపోవడం మండల అధికారులు బదిలీలు ఫించన్ దారుల వేలిముద్రలు సరిపడక పోవడం వంటి సమస్యలు కారణంగా ఆలస్యంగా పంపిణీ జరుగుతుంది.నియోజకవర్గంలో ఇరవైఐదువేల మంది కి పంపిణీచేసేందుకుప్రభుత్వం నిధులకేటాయింపు చేసినా సాంకేతిక కారణంగా ఇబ్బందులకుగురవుతున్నారు.
Last Updated : Jul 14, 2019, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.