వివాహేతర సంబంధం ఓ యువకుడ్ని బలి తీసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది. తాటిచెట్లపాలెం చిట్టిబాబుకాలనీలో శ్రీను అనే యువకుడిని సమీప బంధువైన ఆసనాల చిన్నా కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం చిన్నా నాల్గొవ పట్టణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడు చిన్నా వద్ద నుండి హత్యకు వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే.. హత్య చేసినట్లు నిందితుడు చిన్నా పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: