ETV Bharat / state

విశాఖపట్నం జిల్లాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం - bjp leader sujatha

విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. తమ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రధాన పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యలమంచిలిలో ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు ప్రచారం చేపట్టగా... నర్సీపట్నంలో తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రచారం చేశారు. విశాఖ ఎన్నికల ప్రచారంలో భాజపా-జనసేన అభ్యర్థి సుజాత పాల్గొన్నారు.

municipal election campaigning in vizag district
విశాఖపట్నం జిల్లాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 5, 2021, 8:19 PM IST

తెలుగుదేశం పార్టీకి త్వరలో మంచి రోజులు వస్తున్నాయని, ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. సుబ్బారాయుడుపాలెం, జోగినాథపాలెం, అప్పన్నదొరపాలెంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే నర్సీపట్నం పురపాలికలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

విశాఖపట్నం జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు కోరారు. పట్టణంలోని 9, 10వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... పట్టణాభివృద్ధికి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే యలమంచిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చుదిద్దుతామని వెల్లడించారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

విశాఖ నగరంలోని తొమ్మిదో డివిజన్​లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఉమ్మిడి సుజాత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలి: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.