విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావుతో కలిసి సమగ్ర సర్వే.. జిల్లాలోనే మొదటగా రామయోగి అగ్రహారంలో ప్రారంభించారు. నిజమైన భూ యజమానులకు సమగ్ర సర్వే శాశ్వత పరిష్కారం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. సర్వే సమయంలో ఉత్పన్నం కానున్న సమస్యలను అధికారులు ఎక్కడికక్కడ పరిష్కరిస్తారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రామదేవతలకు సంబంధించిన భూములు సైతం దోపిడీదారులు చేతుల్లోకి వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. సమగ్ర సర్వేతో పరిష్కారం లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో తుపాకుల కలకలం..పోలీసుల ఆరా