ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన వారితో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న నలుగురు రోగులకు చికిత్స నిమిత్తం 10,84,200 రూపాయలు నగదు చెక్కును పంపిణీ చేశారు. అనంతరం యువజనోత్సవాల్లో భాగంగా ఎంపీ కార్యాలయంలో స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆమె... యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యంతో హెచ్పీసీఎల్ కంపెనీ అనకాపల్లిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని వివరించారు. దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: