ETV Bharat / state

మాయాబజార్ చిత్రం తరహాలో.. పెట్టుబడుల ఒప్పందాలు: రఘురామకృష్ణరాజు - తాజా వార్తలు

MP Raghurama Raju: పారిశ్రామికవేత్తల సదస్సులోని పెట్టుబడుల ఒప్పందాలు, మాయాబజార్ చిత్రం తరహాలాగా ఉందని ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ప్రచారానికి చేసుకోవడానికే.. ఈ గణంకాలు ఉపయోగపడతాయని ఆయన విమర్శించారు. తన ముఖం చూసే రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు పెడుతున్నారని చెప్పుకోవడానికి సీఎం జగన్‌ ఈ డ్రామా ఆడుతున్నారని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు

MP Raghurama Raju
రఘురామకృష్ణరాజు
author img

By

Published : Mar 4, 2023, 10:50 PM IST

MP Raghurama Raju on GIS 2023: పారిశ్రామిక అభివృద్ధి పేరిట రాష్ట్రంలో భూ దోపిడి చేస్తున్నారని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. పెట్టుబడులను పెట్టే సోలార్ విద్యుత్ కంపెనీలకు భూములు ఎక్కడ నుంచి తెస్తారని విమర్శించారు. నెడ్ క్యాప్ వద్ద ఉన్న భూములెన్ని... సోలార్ కంపెనీలకు కావాల్సింది ఎంత అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతామంటూ ఇచ్చిన హామీలకు ఆ కంపెనీల మార్కెట్ క్యాప్‌కు అసలు పొంతనే లేదన్నారు. పారిశ్రామిక సదస్సుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

పారిశ్రామికవేత్తల సదస్సులోని పెట్టుబడుల ఒప్పందాలపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. మాయాబజార్ చిత్రం తరహాలో రాష్ట్రంలోనే అభివృద్ధి జరగనుందని ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ప్రచారానికి చేసుకోవడానికి మినహా... పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే సూచనలు కనిపంచడం లేదని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక అభివృద్ధి పేరిట పాలకులు, పారిశ్రామికవేత్తలు కలిసి దోచుకోవడానికి మాత్రమే ఈ ఒప్పందాలు జరిగాయని ఆయన విమర్శించారు. పెట్టుబడులు పెడతామని చెబుతున్న సంస్థల మార్కెట్ క్యాప్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. చాల సంస్థలకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే అంత ఆర్థిక స్తోమత లేదన్నారు. ఈ సదస్సులో రెన్యువల్ ఎనర్జీ కోసం మాత్రమే ఎక్కువగా ఒప్పందాలు జరిగినట్లు వెల్లడించారు.

ఎన్‌టీపీసీ 2.35 లక్షల కోట్లతో 77 వేల ఉద్యోగాలు ఇస్తోందంటూ... చేస్తున్న ప్రచారంపై రఘురామకృష్ణరాజు అనుమానాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాలో జరిగిన ఒప్పందాల అమలు విషయంలో... ఎన్‌టీపీసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత ఏడాది క్రితం ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందన్నారు. హ్యాచ్ వెంచర్స్ సంస్థ నూతన ఆలోచనలతో, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పింది... ఎవరూ అంతగా వెంచర్ క్యాపిటల్ లో వెచ్చించిన దాఖలాలు లేవని రఘురామరాజు అన్నారు . అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.10వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారని అయితే, ఇటీవల ఆ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసినప్పటికీ, ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నట్లు రఘురామ తెలిపారు. ఇలా పలు సంస్థలు చేసుకున్న ఒప్పందాలపై తనదైన తరహాలో ప్రశ్నలు లేవనెత్తారు.

గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులోను కూడా పెద్దగా చేసిందేమీ లేదని రఘురామరాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి, నొక్కిన బటనే మళ్ళీ నొక్కారని ఎద్దేవా చేశారు. తమ పథకాల పేర్లను మారిస్తే నిధులను నిలిపివేస్తామని ఇటీవల కేంద్రం తాను రాసిన లేఖలకు ఇచ్చిన సమాధానంలో హెచ్చరించిందని తెలిపారు. తన ముఖం చూసే రాష్ట్రంలో రూ.11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు పెడుతున్నారని చెప్పుకోవడానికి సిఎం జగన్‌ ఈ డ్రామా ఆడుతున్నారని రఘురామ దుయ్యబట్టారు. రాష్ట్రంలో... 450 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈ సబ్సిడీని ఇప్పటికీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్నా.. విశాఖకు మకాం మారుస్తున్నట్లు పారిశ్రామికవేత్తలకు జగన్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఇవీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.