త్వరలో ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయమని కోరుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. దిల్లీలో ఎంపీలతో కలిసి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలాసీతారామన్ని కలిసి వారి దృష్టిలో ఈ విషయాన్ని ఉంచామన్నారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రిని కలిసేందుకు సన్నద్ధమవుతున్నామని వివరించారు. అవసరమైతే కార్మిక సంఘాల నేతలను దిల్లీకి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'