ETV Bharat / state

రుషికొండలో నిర్మాణాలు అక్రమమో.. సక్రమమో తేల్చండి: ఎంపీ జీవీఎల్ - ఏపీ రాజకీయ వార్తలు

MP GVL questioned in Parliament: రుషికొండలో అక్రమ నిర్మాణాలపై చేపట్టిన చర్యలను గురించి బీజేపీ ఎంపీ జీవీఎల్ పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఎంపీ ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్పందించారు. కేంద్ర కమిటీ విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలని తెలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సభలో బదులిచ్చారు.

ఎంపీ జీవీఎల్
GVL
author img

By

Published : Dec 23, 2022, 7:49 PM IST

illegal construction in Rushikonda: రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుసా అంటూ.. పార్లమెంటులో ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించి రుషికొండలో అక్రమ నిర్మాణాలపై చేపట్టిన విషయాన్ని ఆయన పార్లమెంట్​లో లేవనెత్తారు. రుషికొండ అంశంపై కేంద్రం దర్యాప్తు చేస్తోందని, ఎంపీ జీవీఎల్‌కు కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే సమాధానం ఇచ్చారు 9.88 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి క్లియరెన్స్ ఇచ్చామన్న కేంద్రమంత్రి.. రుషికొండ సందర్శించి సర్వే చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించిందన్న విషయాన్ని సభలో వెల్లడించారు. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని మంత్రిని జీవీఎల్‌ కోరారు. కేంద్ర కమిటీ రుషికొండ రహస్యాన్ని బహిర్గతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.