ETV Bharat / state

"ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వేజోన్ అంశం చేర్చలేదు" - ఏపీ తాజా వార్తలు

MP GVL On Modi Visakha tour: ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వేజోన్ అంశం చేర్చలేదని.. దీనిపై ప్రత్యేకంగా ఇంకో ప్రకటన ఉంటుందని భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు చెప్పారు. ఈ నెల 11న కంచరపాలెం నుంచి మెట్టు వరకు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవునా ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుందన్నారు. నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,.. ఐదు ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు ఉంటాయని తెలిపారు.

GVL on modi tour
మోదీ విశాఖ పర్యటనపై ఎంపీ జీవీఎల్​
author img

By

Published : Nov 9, 2022, 8:47 PM IST

MP GVL On Modi Visakha tour: ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ అంశం చేర్చలేదని, నిర్దేశించిన తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు మాత్రమే ఉంటాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ అంశం లాంటివి షెడ్యూల్​లో లేవనన్నారు. ఈనెల 11వ తేదీ రాత్రి విశాఖ చేరుకోగానే ఒకటిన్నర కిలోమీటర్ల పొడవునా కంచరపాలెం నుంచి మెట్టు వరకు ప్రధానమంత్రి రోడ్ షోను భాజపా నిర్వహిస్తుందన్నారు.

12వ తేదీ ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభాస్ధలి వద్ద కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ.. నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, రాయ్​పూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విశాఖలో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకూ నేరుగా పోర్టు రహదారి, గెయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని అంగుల్ వరకూ గెయిల్ పైప్​లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్​ చేపడుతున్న ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని జీవీఎల్​ స్పష్టం చేశారు.

విజయవాడ-నర్సాపూర్-భీమవరం-గుడివాడ-నిడదవోలు రైల్వే లైన్ జాతికి అంకితం చేయడం మినహా మరే కార్యక్రమాలు ఉండబోవని తేల్చి చెప్పారు. ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదని, రైల్వే జోన్ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం దృష్ట్యా దానిని ఇప్పుడు అంశాలలో చేర్చలేదన్నారు. రైల్వే జోన్​కు ఇదివరకే ప్రకటన చేశామన్నారు. రైల్వేజోన్​పై ప్రత్యేకంగా వేరే ప్రకటన ఉంటుందని తెలిపారు. ప్రధాని ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం అనేది వైజాగ్ ప్రజలకు ఎంతో గర్వకారణమని.. విశాఖ అభివృద్ధికి, భాజపా బలోపేతం కావడానికి ప్రధాని టూర్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.