ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తిరుగుతున్న మూడు ప్రైవేటు బస్సులను అనకాపల్లి రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఏపీ 16 టీవీ 0066 నెంబర్‌తో అనకాపల్లిలో ఒకటి, గాజువాకలో ఇంకోటి.. కూర్మన్నపాలెంలో మరొకటి తిరుగుతున్నట్లు గుర్తించారు.
మూడు బస్సులకు ఛాసిస్ నెంబర్ మార్పు చేసినట్లు అధికారులు నిర్ధరించారు. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తిరుగుతున్న మూడు వాహనాలను.. రవాణాశాఖ కమిషనర్ రాజారత్నం ఆదేశాలతో సీజ్ చేసిన అధికారులు.. విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
THEFT: వాష్‌రూంకు వెళ్లొచ్చేలోపు బ్యాగు చోరీ.. ఇక టవల్తోనే...!