తీవ్ర రక్తస్రావంతో బాలింత మృతి.. బంధువుల ఆందోళన - latet crime news in viskaha
పసిబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్రరక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ బాలింత వరలక్ష్మికి శస్త్ర చికిత్స అనంతరం రక్తం ఎక్కించామని తెలిపారు. అప్పటికే రక్తం చాలా పోవడం వల్ల ఆమె చనిపోయినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు.
mother died in viskha dist anakapalli