ETV Bharat / state

సినీ ఫక్కీలో చోరీ... అడ్డుకట్ట వేసిన విశాఖ పోలీసులు

author img

By

Published : Sep 8, 2020, 12:29 PM IST

తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి.. 20 లక్షలతో పరారైన ముఠాను పోలీసులు అరెస్టు చేసి.. ఐదుగుర్ని రిమాండ్​కు తరలించారు. ఈ ఘటన విశాఖ నగరం పాత డెయిరీఫారంలో జరిగింది.

money recovery from thief gang
దొంగలు ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

తక్కువ ధరకే బంగారం లభిస్తుందనీ.. ఓ ముఠా చెప్పిన మాయమాటలు నమ్మాడో వ్యాపారి. దీంతో వ్యాపారి నుంచి 20 లక్షల రూపాయలతో నిందితులు ఉడాయించారు. ఈ ఘటన విశాఖ నగరం పాత డెయిరీఫారంలో జరిగింది.

ఏం జరిగిందంటే..

విశాఖ నగరం పాత డెయిరీఫారానికి చెందిన కిరాణా వ్యాపారి పి. కోటేశ్వరరావు బంగారాం కొనాల్సి వచ్చి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చిట్టిరాజును సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అట్టాడ సీతారామ్ అలియాస్ చంద్రశేఖర్ అలియాస్ రెడ్డిని సంప్రదించారు. అర కిలో బంగారాన్ని 20 లక్షలకు ఇస్తానని నమ్మించాడు.

ఆగస్టు 15:

కోటేశ్వరరావు, చిట్టిరాజు గోపాలపట్నం తాము చెప్పిన దుకాణానికి డబ్బుతో వస్తే ఆ నగదు స్థానంలో ఎలాగోలా తెల్లకాగితాలు ఉంచి వెనక్కి ఇచ్చేయాలని నిందితులు భావించారు. అయితే కోటేశ్వరరావు, చిట్టిరాజు డబ్బులు తీసుకువెళ్లలేదు. బంగారం చూపిస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు.

ఆగస్టు 17:

డబ్బులతో పీఎంపాలెం స్టేడియం వద్దకు వస్తే బంగారం ఇస్తామని నిందితులు నమ్మించారు. కోటేశ్వరావు, చిట్టిరాజు వెళ్లారు. బంగారం ఇస్తామని నిందితుల నమ్మించారు. కోటేశ్వరరావు, చిట్టిరాజు వెళ్లారు. బంగారం తెచ్చేలోపు డబ్బులు లెక్కపెడదామని పక్కనే ఉన్న వీధిలోకి వీరిని సీతారామ్ తీసుకువెళ్లాడు.

అక్కడేమయిందంటే...

సీతారామ్ ద్వారా సమాచారం అందుకున్న ముఠా సభ్యులు ఇన్నోవా కారులో పోలీసు సైరన్​తో వచ్చారు. పోలీసు దుస్తుల్లోని వీరిని చూసి కోటేశ్వరరావు భయపడిన సమయంలో డబ్బుతో.. సీతారామ్ ఆ కారులో ఎక్కి పారిపోయాడు. దీంతో బాధితుడు కోటేశ్వరారు పీఎం పాలెం పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

ఏడీసీపీ వేణుగోపాల నాయుడు, ఏసీపీ శ్రావణ్​కుమార్, సీఐ రామచంద్రరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం కోల్​కతాకు వెళ్లి సీతామారామ్​ను అరెస్టు చేసి విశాఖకు తీసుకు వచ్చారు.

ఎవరి నుంచి ఎంత స్వాధీనం చేసుకున్నారంటే...

సీతారామ్ నుంచి 50 వేలు, ఒక సెల్​ఫోన్, అంబటి సంతోష్ నుంచి 10.95 లక్షలు, ముత్యాల నాయుడు నుంచి 50 వేలు, శివదుర్గారావు నుంచి 50 వేలు, జ్ఞానేశ్వరరావు నుంచి 5 వేలు.

వీరిపై హైదరాబాద్​లో పంజాగుట్ట, శంషాబాద్​, కోల్​కతా, జిల్లాలోని సబ్బవరం, అనకాపల్లి, గోపాలపట్నం, నాలుగో పట్టణం, టెక్కలి పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. కీలక సూత్రధారి అయిన సుదర్శన్​రెడ్డి పరారీలో ఉన్నాడు.

ఇదీ చదవండి: విశాఖలో భాజపాకు పూర్వ వైభవం రావాలి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.