విశాఖ జిల్లా పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. భక్తులు లేకుండానే సాధారణంగా ఉత్సవాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులను ఉత్సవాల్లో అనుమతించలేదు. ఏటా మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు వచ్చేవారు. కరోనా నేపథ్యంలో కొంతమంది పెద్దల సమక్షంలో మాత్రమే వేడుకను ముగించారు.
పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మి దంపతులు ఘటాలు మోశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి... అమ్మవారి పాదాలు తలపై పెట్టుకుని అమ్మవారి గుడికి చేర్చారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి విముక్తి చేయాలంటూ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అమ్మ వారిని కోరారు.
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు