ETV Bharat / state

మాచ్​ఖండ్ కేంద్రంలో 2 యూనిట్ల ఆధునీకరణ: ఏపీ జెన్​కో

ఆంధ్ర ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్లను ఆధునీకరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు ఏపీ జెన్​కో తెలిపింది. మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లకు కాలం చెల్లిందని వెల్లడించింది. యూనిట్లు మరమ్మతులకు గురవుతున్నాయని స్పష్టం చేసింది.

మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్ల ఆధునీకరణ : ఏపీ జెన్​కో

author img

By

Published : Oct 1, 2020, 9:09 PM IST

ఆంధ్ర ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్లను ఆధునీకరించేందుకు ప్రతిపాదన చేశామని ఏపీ జెన్​కో ముఖ్య ఇంజనీర్ గౌరీపతి తెలిపారు. సీలేరు కాంప్లెక్స్​లో పర్యటించిన గౌరీపతి.. మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లకు కాలం చెల్లిందని చెప్పారు. అవి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. ఇప్పటికే ఒక యూనిట్ పూర్తి స్థాయి మరమ్మతు చేయాల్సి వచ్చిందని వివరించారు.

ఆధునీకరించేందుకు అంగీకారం..

మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్ల ఆధునీకరణ : ఏపీ జెన్​కో
మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్ల ఆధునీకరణ : ఏపీ జెన్​కో

తరచూ సమస్యలు వస్తున్న కారణంగా.. మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లను ఆధునీకరించడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఓహెచ్​పీసీ ఒడిస్సా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. త్వరలోనే అంచనాలు వేసి పనులు ప్రారంభిస్తామని సీఈ స్పష్టం చేశారు.

రెండో దశకు ప్రతిపాదనలు సిద్ధం..

ఇటీవలే మంత్రి మండలి ఆమోదించిన పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో రెండో దశకు సంబంధించి అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మార్చికల్లా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. సీలేరు ఎత్తిపోతల పథకం సంబంధించి వ్యాప్​కో సంస్థ అధ్యయనం చేస్తుందన్నారు. డీపీఆర్ వచ్చిన తర్వాతే అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించడానికి ఏపీ జెన్​కో యాజమాన్యం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు.

5- 7 మి.యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి..

ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించడానికి సుమారు రెండేళ్లు పడుతుందన్నారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఒకటి, నాలుగు యూనిట్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. వీటిని ప్రైవేట్ కంపెనీతో మరమ్మతులు చేయించి సాధ్యమైనంత తొందరగా వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంప్లెక్స్ నుంచి సుమారు 5 నుంచి 7 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చీఫ్ ఇంజనీర్ గౌరీపతి స్పష్టత ఇచ్చారు.

ఇవీ చూడండి:

యూపీలో గోవులకున్న రక్షణ స్త్రీలకు లేదు: మహిళా సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.