Revenue Department Special Chief Secretary RP Sisodia Interview : ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ (AP Land Grabbing Prohibition Act) ద్వారా భూ ఆక్రమణదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ ఆక్రమణలపై ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఆ యాక్ట్ అంతగా ప్రభావం చూపలేదు : భూ ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని ఆర్పీ సిసోదియా అన్నారు. 1982 నాటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంతగా ప్రభావం చూపలేని పరిస్థితి నెలకొందని, అందుకే సమగ్రమైన యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వం భావించిందని వెల్లడించారు. కఠిన శిక్షలు, జరిమానాలతో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ తెచ్చామని తెలిపారు. ఈ యాక్ట్ ద్వారా భూ ఆక్రమణదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, భూ ఆక్రమణదారులకు పది నుంచి 14 ఏళ్ల వరకు నిందితులకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేక కోర్టుల ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో చేస్తున్న ఆ ప్రచారం అవాస్తవం - ఆర్పీ సిసోడియా - RP Sisodia on AP Floods
నిజానిజాలు రుజువు చేసుకొనే బాధ్యత నిందితులదే : భూ ఆక్రమణలకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. భూమి ప్రభుత్వానిదైనా, ప్రైవేటు వ్యక్తులదైనా యాక్ట్ వర్తిస్తుందని, బినామీలు సైతం భయపడేలా యాక్ట్ నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ద్వారా నిజానిజాలు రుజువు చేసుకొనే బాధ్యత నిందితులపైనే ఉంటుందంటున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియాతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం- త్వరలో మ్యాపింగ్ సిద్ధం: ఆర్పీ సిసోదియా - visakha land issues