వైకాపా చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రవేశపెడుతున్న పథకాలను చూసి పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులను గెలిపించాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ప్రజలను అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం గిడుతూరు, రాచపల్లి, గంగవరం ఇతర గ్రామాల్లో పర్యటించారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పథకాలను అర్హులైన వారికి అందిస్తున్నామని పేర్కొన్నారు. తాము చేపట్టిన అభివృద్ధిని చూసి తామ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ , మాకవరపాలెం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: