రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరుపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాసంకర్ గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించినా.. ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల ప్రక్రియను ప్రకటించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్... చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
జగన్ పత్రికలో కనిపించిన పండుగ.. రైతుల కళ్లలో లేదు: నారా లోకేశ్