ముఖ్యమంత్రి జగన్కు.. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు లేఖ రాశారు. కరోనా , తుఫానులతో ఎన్నో కుటుంబాలు ఇంకా ఆర్ధిక కష్టాలలో మునిగిపోయి ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యాపారాలు లేకపోవడం, కరెంటు చార్జీలు పెరగడం, ఉద్యోగాలు పోయి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో.. సివిల్ సప్లైస్ శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అన్ని రైతు బజార్లు , ప్రైవేట్ దుకాణాలలో ధరలను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ధరలు పెరిగినపుడు రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ.. లేదా పొరుగు రాష్ట్రాలు నుంచి కానీ కొనుగోలు చేసి ధరలు అదుపుచేయడం రాష్ట్రంలో ఆనవాయితీగా ఉందని గుర్తుచేశారు. దీని పై పనిచేసేందుకు ఒక పెద్ద ప్రభుత్వ వ్యవస్థే ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు.
ఇదీ చదవండి : నవంబర్‌లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' మూడో దశ ట్రయల్స్