ETV Bharat / state

సభకు వచ్చే ముందు డ్వాక్రా మహిళలందరికీ శిక్షణ ఇవ్వాలి: ఎమ్మెల్యే అవంతి

MLA Avanathi fire on YCP Leaders: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల మధ్యకు వెళ్లేటప్పుడు ఎవరూ ప్రభుత్వ పథకాలపై స్పందించడం లేదని ఎమ్మెల్యే అవంతి సభలోనే అసహనాన్ని వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన సామాజిక భవనాలను ప్రారంభించిన అనంతరం నాయకులు అధికారులపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

MLA Muttamshetty Srinivasa Rao
ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
author img

By

Published : Dec 13, 2022, 1:09 PM IST

ఎమ్మెల్యే అవంతి సభలోనే వైసీపీ నేతలపై అసహనం

MLA Avanathi fire on YCP Leaders: విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన సామాజిక భవనాలను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సున్నా వడ్డీ అమలు చేశారా అని ఓ మహిళను ప్రశ్నించగా.... 'చేశారని' ఆ మహిళ జవాబు చెప్పారు. దీంతో ఖంగుతిన్న ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు ఆ మహిళకు.. చేయలేదు అని చెప్పడంతో.... ఆ మహిళ చేయలేదంటూ సమాధానం చెప్పింది. దీంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారిణినిపై అసహనం వ్యక్తం చేశారు. సభకు వచ్చే ముందే డ్వాక్రా మహిళలందరికీ శిక్షణ ఇవ్వాలని.... సభ వద్ద చెప్పడం సరికాదని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.