ETV Bharat / state

'అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరచిపోం' - minister srinivas reddy

విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని... విశాఖ జిల్లా కంబాలకొండలో నిర్వహించారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి... అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మొత్తం 18 మంది సిబ్బంది ఇప్పటి వరకు ప్రాణాలు వదిలారని మంత్రి చెప్పారు. వారి త్యాగాలను ప్రభుత్వం, అటవీ శాఖ ఎన్నటికీ మరచిపోదని బాలినేని శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరచిపోం
author img

By

Published : Nov 11, 2019, 6:53 AM IST

అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరచిపోం

రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగే ప్రాంతల్లో ఉండే సిబ్బందికి... అధునాతన ఆయుధాలు ఇచ్చినట్టు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. విశాఖ జిల్లా కంబాలకొండలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. అటవీ ప్రాంతంలో వేగంగా కదిలే వాహనాల కోసం సీఎం జగన్ రూ.40 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఎర్రచందనం అమ్మకాలు కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరినట్టు చెప్పారు.

అటవీ భూములు పరిరక్షణకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 33 శాతం అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు... రాష్ట్ర అటవీ దళాధిపతి ప్రదిప్​కుమార్ చెప్పారు. అటవీ శాఖ సిబ్బందికి వాహనాల కొనుగోలు కోసం రూ.40 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అడవిలో వేగంగా కదిలే వాహనాలు సమకూరుస్తామని చెప్పారు. ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.