విశాఖ జిల్లా సింహాచలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారిని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకొని..బేడా మండపం ప్రదక్షిణ చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ..అప్పన్న స్వామివారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్ పాలన ఆశాజనకంగా సాగుతుండటం శుభపరిణామమన్నారు. దేవస్థానం పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదీచదవండి