ETV Bharat / state

రూ.3 వేల కోట్లతో మత్స్యశాఖ అభివృద్ధికి ప్రణాళికలు: మోపిదేవి - aqua quarantine lab in vishaka news

రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆక్వా అథారిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. సుమారు 50 రకాల మత్స్యకార ఉత్పత్తులు ఆంధ్రా ప్రాంతం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని వివరించారు.

minister mopidevi venkataramana on aqua industry

author img

By

Published : Jun 24, 2020, 5:12 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారంపేట గ్రామంలో సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆక్వా క్వారంటైన్ పరిశ్రమకు మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.3 వేల కోట్ల రూపాయలతో మత్స్య శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ప్రాజెక్టులను తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. విశాఖ జిల్లా తీరప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధితోపాటు మత్స్య శాఖ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టినట్లు వివరించారు.

ఇదీ చదవండి: అది 'జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం': నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.