ETV Bharat / state

కన్నెర్ర చేస్తే చాలు.. పాదయాత్రలు ఆగిపోతాయి: మంత్రి బొత్స - వైఎస్‌ జలయజ్ఞం

BOTSA SATYANARAYANA : కన్నెర్ర చేస్తే చాలు.. 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స.. 10 వేల కోట్లు పెడితే ముంబయిని తన్నే నగరమవుతుందన్నారు.

BOTSA SATYANARAYANA
BOTSA SATYANARAYANA
author img

By

Published : Sep 25, 2022, 5:01 PM IST

Updated : Sep 25, 2022, 9:44 PM IST

MINISTER BOTSA ON THREE CAPITAL : అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నెర్ర చేస్తే చాలు.. ఐదు నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని.. కానీ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖలో రూ.10 వేల కోట్లు పెడితే ముంబయిని తన్నే నగరమవుతుందని వ్యాఖ్యానించారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలన్నారు.

ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని.. ఇది వాస్తవమని తెలిపారు. వైఎస్‌ జలయజ్ఞంతో తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు వచ్చాయని.. ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని పేర్కొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలని.. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు.

కన్నెర చేస్తే చాలు.. పాదయాత్రలు ఆగిపోతాయి

ఇవీ చదవండి:

Last Updated : Sep 25, 2022, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.