రాష్ట్రాన్ని పర్యాటకంగా అగ్రస్థానంలో నిలుపుతామని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెలలో విజయవాడలో బాపు మ్యూజియం, ఏలూరు మ్యూజియం ప్రారంభిస్తామని చెప్పారు. కోటప్పకొండ రోప్ వేను త్వరలోనే పూర్తి చేస్తామన్న అవంతి శ్రీనివాస్... వచ్చే నెల నుంచి అన్ని జిల్లాల్లో పర్యాటక పనుల పరిశీస్తామన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట రూ.10 లక్షల పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అవంతి శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండీ... సీఎం జగన్తో మేజర్ జనరల్ భేటీ