భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్ అభివృద్ధి కోసమే ల్యాండ్ బ్యాంకు ఉంచాం తప్ప, మరో ప్రయోజనం కోసం కాదని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షనేతలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికను కేంద్ర మంత్రి ఎంతో ప్రశంసించారని చెప్పారు. నిధులు కూడా ఇస్తామని చెప్పడాన్ని స్వాగతించలేకే కొందరు.. అనవసరమైన విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలూ జరగడం లేదని మంత్రి అవంతి స్పష్టం చేశారు. దీనిపై రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు చేస్తున్న యత్నాలు సరికావన్నారు. వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందన్న వాస్తవం మర్చిపోయి అప్పుడేమీ చేయలేక.. ఇప్పుడు విమర్శలు చేయడమేమిటని నిలదీశారు.
ఇదీ చదవండి
రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవు - ఇంధన శాఖ కార్యదర్శి