విశాఖ జిల్లాలో రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రభుత్వం అందించే రెండో విడత సాయాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. విశాఖ కలెక్టరేట్ లో లబ్ధిదారులకు చెక్కులను అందించారు. జిల్లాలో 3.85 లక్షల మందికి గాను సుమారు 95 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కింద అందించింది.
ప్రతి రైతుకు ఖరీఫ్ ఆఖరి దశలో పంట కోసుకోవడానికి ఉపయోగపడేలా నాలుగు వేల రూపాయల చొప్పున అందిస్తున్నామని మంత్రి అవంతి చెప్పారు. వ్యవసాయాన్ని దండగ అనే రోజులు నుంచి పండగ అనే రోజులు తమ ప్రభుత్వ పరిపాలనతో వచ్చాయని అన్నారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్పై విచారణ.. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు నోటీసులు