'దేవుడి భూములు దోచేసే ఉద్దేశం మాకు లేదు' - మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో మంత్రి అవంతి స్పందన
పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం తప్ప.. దేవుడి భూములు దోచేయాలని తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ వీఎంవీఏ బాలల ప్రాంగణంలో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొనారు. సంచైతను మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా నియమించడంపై వివరణ ఇచ్చారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.