ETV Bharat / state

'ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం'

author img

By

Published : Jun 28, 2021, 7:58 AM IST

స్లమ్ రహిత విశాఖను తయారు చేయడమే లక్ష్యమని.. మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో 98 వార్డుల అభివృద్ధి గురించి చర్చించామని తెలిపారు. వైకాపా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

minister avanthi meeting with officers at visakha
మంత్రి అవంతి శ్రీనివాస్

ప్రతి పేదవాడికి పథకాలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖలో అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాజీవ్ గృహకల్పకు కొత్తగా ప్రపోజల్ చేసి రీ మోడల్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్​కు మంత్రి అవంతి సూచించారు. అమరావతి నగర్, అవంతి ఫంక్షన్ హాల్, గణేష్ నగర్, వాంబే కాలనీ, రుషికొండలో ప్రైమరీ హెల్త్ సెంటర్​లు ఏర్పాటు చేస్తామని అన్నారు. సామాన్యుడికి నష్టం కలిగించే పని ఈ ప్రభుత్వం ఎప్పుడు చేయదని స్పష్టం చేశారు. స్లమ్ రహిత విశాఖను తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి. RAINS: ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.