విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 6, మినుములూరులో 7, చింతపల్లిలో 8, పాడేరులో 8 డిగ్రీలు నమోదయ్యాయి. నరాలు కొరికే చలితో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు.
చలి మంటలు వేసుకుంటే గాని ఉపశమనం లభించడం లేదు. ఈ పరిస్థితితో విద్యార్థులు, ఉద్యోగస్థులు, కూలి పనివారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో వారం రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదీ చదవండి:
విశాఖ పోర్టు ట్రస్ట్ కొత్త డిప్యూటీ చైర్మన్గా దుర్గేష్ కుమార్ దూబే